మస్క్యులోస్కెలెటల్ ఔట్ పేషెంట్లకు శుభవార్త.. యాంటీ గ్రావిటీ ట్రెడ్మిల్ ఆవిష్కరణ..!!
- October 15, 2024
దోహా: హమద్ మెడికల్ కార్పొరేషన్ కు చెందిన ఖతార్ పునరావాస సంస్థ (QRI) విప్లవాత్మక యాంటీ గ్రావిటీ ట్రెడ్మిల్ ను ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా దానిని మస్క్యులోస్కెలెటల్ ఔట్ పేషెంట్ విభాగంలో ఏర్పాటు చేశారు. ఇది నడవలేని రోగులకు రికవరీ ప్రక్రియను మెరుగుపరుస్తుందని HMCలోని కార్పొరేట్ రీహాబిలిటేషన్ థెరపీ సర్వీసెస్ లీడ్ డాక్టర్ హనాది అల్ హమద్ తెలిపారు. కీళ్ళు , కండరాలపై ఒత్తిడి లేకుండా ఇది చేస్తుందని, తీవ్రమైన గాయాలు, శస్త్రచికిత్సల నుండి కోలుకుంటున్న వ్యక్తులకు ఇది చాలా కీలకమైనదిగా పేర్కొన్నారు. యాంటీ గ్రావిటీ ట్రెడ్మిల్ అధునాతన డిఫరెన్షియల్ ఎయిర్ ప్రెజర్ టెక్నాలజీని ఉపయోగించి, వాకింగ్ లేదా రన్నింగ్ సమయంలో రోగులకు మద్దతిచ్చే శరీర బరువు మొత్తాన్ని అడ్జస్ట్ చేసేలా రూపొందించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి