బిగ్‌బాస్ విన్నర్ అతడేనా?

- October 16, 2024 , by Maagulf
బిగ్‌బాస్ విన్నర్ అతడేనా?

బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8కి ఈ మధ్య కాస్త ఊరట లభించిన సంగతి తెలసిందే.వైల్డ్ కార్డ్ పేరు చెప్పి, ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ పెంచారు.గత సీజన్లలో కేవలం ఎంటర్‌ట‌ైన్‌మెంట్ మాత్రమే పంచిన కొందరు కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసి హౌస్‌లోకి దించిన సంగతి తెలిసిందే.
దాంతో హౌస్‌కి కలొచ్చింది. అలాగే జనానికి బిగ్‌బాస్ షో మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఇకపోతే, ఈ సీజన్ విన్నర్ ఎవరా.? అనే అంశం పైనా జనాల్లో ఒకింత క్లారిటీ వుంది.
మొదట్లో కామ్ గోయింగ్ అనిపించిన నబీల్ మెల్ల మెల్లగా తనను తాను డెవలప్ చేసుకున్నాడు. టాస్కుల్లో మంచి పనితనం చూపించడంతో పాటూ, హౌస్ మేట్స్ మధ్య కూడా పాజిటివిటీ సంపాదించుకున్నాడు.
అలాగే వీక్షకులు కూడా నబీల్‌నే ఈ సారి సీజన్ విన్నర్ అవుతాడని అనుకుంటున్నారు. అంతేకాదు, లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన సీత కూడా ఇదే కోరుకుంది. హోస్ట్ నాగార్జున దృష్టిలోనూ నబీల్‌కి మంచి పేరుంది.
సో, ఎలా చూసుకున్నా.. ఈ సారి బిగ్‌బాస్ కప్పు గెలుచుకునేది నబీలే అని అందరూ ఆశిస్తున్నారు. అయితే, బిగ్‌బాస్‌లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. మంచిగా అనుకున్నవాళ్లు చెడుగా ప్రమోట్ కావచ్చు. చెడు అనుకున్నవాళ్లు మంచి వాళ్లుగానూ మారిపోవచ్చు. నబీల్ ఈ తీరు చివరి వరకూ ఇలాగే కొనసాగుతుందా.? లేక మధ్యలోనే ఎలిమినేట్ అవుతాడా.? అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com