మునగాకుతో మెరిసిపోయే యవ్వన సౌందర్యం మీ సొంతం.!

- October 17, 2024 , by Maagulf
మునగాకుతో మెరిసిపోయే యవ్వన సౌందర్యం మీ సొంతం.!

మునక్కాయల్ని ఇష్టపడి తింటుంటారు. కానీ, మునగాకును పెద్దగా పట్టించుకోరు. కానీ, మునగాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయని తెలిస్తే మాత్రం వదిలి పెట్టరు. వంటకాల్లో అనేక రకాలుగా మునగాకుల్ని వాడుకోవచ్చు.

పప్పులో వేసుకోవచ్చు. చారు, రసం, సాంబారు వంటి వాటిలో మునగాకుల్ని విరివిగా వాడుకోవచ్చు. అలాగే, నాన్‌వెజ్ ఐటెమ్స్‌లోనూ మునగాకుల్ని మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు.

మునగాకులో విటమిన్ సి ఎక్కువగా వుంటుంది. జింక్, మెగ్నీషియం, ఐరన్ వంటివి కూడా పుష్కలంగా వుంటాయ్.

మునగాకును రెగ్యులర్‌గా తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే, కీళ్ల నొప్పులు, వాపులు వంటి సాధారణ వ్యాధులు సులభంగా నయమవుతాయ్.

అన్నింటికీ మించి మునగాకును తింటే వృద్ధాప్యం త్వరగా దరి చేరదని తాజా సర్వేలో తేలింది. అందుకు కారణం మునగాకులో వుండే యాంటీ ఏజింగ్ లక్షణాలే.

ముఖ్యంగా యవ్వనంలో పింపుల్స్‌తో బాధపడేవారు చాలా ఎక్కువ. పింపుల్స్ అందాన్ని చెడగొట్టడమే కాకుండా.. వయసు మళ్లినట్లుగా మార్చేస్తుంది.

అందుకే పింపుల్స్‌కి మునగాకు రసం చాలా చాలా మంచిది. రాత్రి పడుకునే ముందు వారానికి రెండు సార్లు మునగాకు రసం అప్లై చేస్తే ముఖంపై పింపుల్స్ పోయి, చర్మం కాంతివంతంగా మారుతుంది.

అంతేకాదు, యాజ్ బార్‌లో వచ్చే చర్మంపై ముడతలు, కళ్లకింద నల్లని మచ్చలు కూడా మునగాకు తినడం వల్ల తగ్గిపోతాయని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com