2026 నాటికి 4 మిలియన్లకు దుబాయ్ జనాభా..!!
- October 17, 2024
యూఏఈ: మెరుగైన ఉద్యోగావకాశాల కోసం ఎమిరేట్‌కు తరలివస్తున్న ప్రవాసులు, పెట్టుబడిదారుల ప్రవాహంతో 2026 నాటికి దుబాయ్ జనాభా 4 మిలియన్లకు చేరుకుంటుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్&పి తెలిపింది. "మేము 2024లో ఎమిరేట్ తలసరి GDPని సుమారు $38,000 (Dh139,460)గా అంచనా వేస్తున్నాము. యూఏఈలోని ఇతర ప్రాంతాలలో నివసించే, పని కోసం దుబాయ్‌కి వెళ్లే వారిని మినహాయించి 2023 సంవత్సరాంతానికి 3.7 మిలియన్లకు జనాభా చేరుకుంది. 2026 నాటికి ఇది 4.0 మిలియన్లకు చేరుకుంటుందని మేము అంచనా వేస్తున్నాము." అని తమ నివేదికలో S&P విశ్లేషకులు తెలిపారు.
దుబాయ్ జనాభా ఈ సంవత్సరంలో 134,000 పైగా పెరిగింది. అక్టోబర్ 16 నాటికి 3.789 మిలియన్లకు చేరుకుంది. జనవరి 2021 నుండి, నగర జనాభా 378,000 పైగా పెరిగింది. ప్రధానంగా విదేశీ నిపుణులు, కార్మికులు, పెట్టుబడిదారుల ప్రవాహం కారణంగా ఇది సాధ్యమైందని నిపుణులు తెలిపారు. ప్రపంచంలోని టాప్ 50 నగరాల్లో దుబాయ్ 15వ స్థానంలో ఉంది. హెన్లీ నివేదిక ప్రకారం 72,500 మంది మిలియనీర్లు ఉన్నారు. 2023లో 3.3 శాతం వృద్ధిని అనుసరించి 2024-2027లో వాస్తవ GDP వృద్ధి సగటున 3 శాతానికి చేరువలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి