‘మెకానిక్ రాఖీ’ మళ్లీ నిద్రపోయిందేం.!
- October 24, 2024
‘ఇంతన్నాడంతన్నాడే. గంగరాజు.. ముంత మామిడి పండన్నాడే గంగరాజు..’ ఏంటీ పాటలోని లిరిక్స్ చెబుతున్నారేంటీ అనుకుంటున్నారా.?
అవునండీ అంతే మరి. ఈ లిరిక్స్ మన యంగ్ హీరో విశ్వక్ సేన్‌కి బాగా సెట్టవుతాయ్. ఆయన నటించిన తాజా చిత్రం ‘మెకానిక్ రాఖీ’.
ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ఈవెంట్‌లో మనోడు చేసిన ఓవరాక్షన్ చూస్తే పైన లైన్స్ కరెక్టే అనిపిస్తాయ్‌గా.
ఇంతవరకూ సైలెంట్‌గా వుంది.. ‘మెకానిక్ రాఖీ’ అనుకున్నారు. చూడండిక ఈ రోజు నుంచి ప్రమోషన్లు ఏ రేంజ్‌లో వుంటాయో.. అన్నాడు. ఏది.! ఆ రోజు తప్ప మళ్లీ మనోడు చెప్పిన హడావిడి కనిపించనే లేదు ఈ సినిమా విషయంలో.
సినిమా వచ్చే నెల 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. టైమ్ అయితే వుందనుకోండి. మనోడు చేసిన ఓవరాక్షన్‌కి సోషల్ మీడియా వేదికగా ఈ రకమైన ట్రోల్స్ వినిపిస్తున్నాయ్. అంతేగా.! అంతేగా.!
అన్నట్లు ఈ సినిమాలో బీటెక్ చేసి, తండ్రి మెకానిక్ షెడ్‌లో పని చేసే కుర్రోడిగా విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







