సంక్రాంతి రేస్‌లో ఎన్ని.?

- October 24, 2024 , by Maagulf
సంక్రాంతి రేస్‌లో ఎన్ని.?

ఈ సారి సంక్రాంతి మోత మోగిపోయేలానే వుంది. ఇప్పటికే నాలుగు సినిమాలు సంక్రాంతికి ఫిక్స్ అయ్యాయ్. అందులో ‘గేమ్ ఛేంజర్’ ఒకటి పెద్ద సినిమా.

అలాగే బాలయ్య 109వ చిత్రం  కూడా వుంది. అక్కినేని హీరో నాగ చైతన్య ‘తండేల్’ కూడా సంక్రాంతి రేస్‌కే ఫిక్సవ్వాలని చూస్తోంది.

చిన్న సినిమాగా సందీప్ కిషన్ నటించిన ‘మజాకా’ సినిమా రిలీజ్ కూడా సంక్రాంతికే సెట్ చేసుకుంది. మరోవైపు మరిన్ని కొన్ని చిన్న సినిమాలు కూడా రేస్‌లో వున్నాయ్.

ఇప్పటికైతే ఈ సినిమాలు పక్కా అనే నమ్మకంతో వున్నారు. అయితే, సంక్రాంతి సీజన్ ఎన్ని సినిమాలనైనా హ్యండిల్ చేయగలదు. ఎన్ని ఎక్కువ సినిమాలొస్తే.. బాక్సాఫీస్ అంత కళకళలాడుతుంది.

అయితే, సంక్రాంతి ఇంకా చాలా రోజులే వుంది. సినిమా పరిస్థితులు అస్సలేం బాగా లేవు. పక్కాగా వస్తాయనుకున్న సినిమాలే వెనక్కి పోతున్నాయ్. ఇప్పట్లో కాదనుకున్న సినిమాలు సడెన్‌గా చప్పుడు లేకుండా వచ్చి వెళ్లిపోతున్నాయ్.

అలాంటిది, డేట్స్ ఫిక్స్ చేసుకున్నా వీటిలో ఎన్ని సినిమాలొస్తాయో, ఎన్ని వెనక్కి పోతాయో చెప్పలేని పరిస్థితి. టైమ్ కూడా చాలా వుండడంతో ఈ రేస్‌లో కొత్తగా యాడ్ అయ్యే సినిమాలింకెన్నో.! లెట్స్ వెయిట్ అండ్ సీ.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com