టీజీఎస్‌ఆర్‌టీసీ కాసుల వర్షం .. రూ.307 కోట్ల రికార్డు కలెక్షన్లు
- October 24, 2024
హైదరాబాద్: దసరా పండుగ టీజీఎస్‌ఆర్‌టీసీకి భారీ ఆదాయం తీసుకొచ్చిపెట్టింది. దసరా, బతుకమ్మ పండుగలను దృష్టిలో పెట్టుకొని అధిక బస్సులను నడిపారు. ఈనెల 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య 15 రోజుల వ్యవధిలో కోట్లాది మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. దీంతో ఈ పండుగ ఆర్టీసీకి ఏకంగా రూ.307 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 7 కోట్ల 7 లక్షల 73 వేల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించారని టీజీఎస్‌ఆర్‌టీసీ వెల్లడించింది. దీంతో ఈ 15 రోజుల్లో ఆర్టీసీకి రూ.307.16 కోట్ల ఆదాయం సమకూరింది.ఈ బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా 10,512 అదనపు బస్సులను మళ్లించినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. పండుగ వేళ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సైతం ఆర్టీసీ అదనపు బస్సులను నడిపించింది. ఈనెల 9, 10, 11 తేదిల్లో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణించినట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!