భూమికి సమీపంలో అస్టరాయిడ్..దుబాయ్ స్కైస్‌లో అద్భుత దృశ్యం..!!
- October 25, 2024
దుబాయ్: దుబాయ్ ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ అక్టోబర్‌లో ఒక పెద్ద గ్రహశకలం భూమికి చేరువవుతోంది. అక్టోబర్ 27న దాని సమీపాన్ని చేరుకోనుంది. దాన్ని 1036 గానిమెడ్ అని పిలుస్తారు. ఇది భూమికి సమీపంలో ఉన్న అతి పెద్ద గ్రహశకలాలలో ఒకటి. దీని వ్యాసం సుమారు 37.7 కిలోమీటర్లు. పరిమాణంలో USలోని హ్యూస్టన్ అంట ఉంటుంది.
గ్రహశకలాలు సూర్యుని చుట్టూ తిరిగే చిన్న, పెద్ద వివిధ ఆకారంలో ఉన్న వస్తువులు. ప్రధానంగా అంగారక గ్రహం, బృహస్పతి మధ్య ఉల్క బెల్ట్‌లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
ప్రస్తుతం అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మహ్మద్ షౌకత్ ఒదేహ్ మాట్లాడుతూ.. గనిమెడ్ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేస్తుందని తెలిపారు. ఇది భూమికి చాలా దగ్గరగా రాదని, కనీసం 51 మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంటుందన్నారు. ఇది "అమోర్" గ్రహశకలంగా పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







