సౌదీ అరేబియా అభివృద్ధికి టూరిజం సెక్టర్ కీలకం.. మంత్రి అల్-ఖతీబ్
- October 25, 2024
శాన్ ఫ్రాన్సిస్కో: శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన నాల్గవ వార్షిక వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ సమ్మిట్‌లో సౌదీ పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ ప్రసంగించారు. ప్రస్తుతం, భవిష్యత్తులో ట్రావెల్ అండ్ టూరిజం రంగానికి స్థిరమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పర్యాటక వృద్ధి రద్దీతో పర్యావరణ సంబంధిత సవాళ్లను తెస్తుందని తెలిపారు. ఆ సవాళ్లను ఎదుర్కొనే విధానలపై ప్రపంచ దేశాలు సంయుక్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని రక్షించి భవిష్యత్ తరాలకు అందజేయాలని, సానుకూల మార్పులతో పర్యాటకాన్ని పునర్నిర్మించాలని కోరారు. సౌదీ అరేబియాలో భవిష్యత్తు సౌదీ నగరాల నిర్మాణ కార్యక్రమంలో టూరిజానికి ప్రత్యేక స్థానం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అల్-ఖతీబ్ “షేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ టూరిజం”, “ది ఫ్యూచర్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం” అనే ఎగ్జిక్యూటివ్ రౌండ్‌టేబుల్ చర్చలో కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







