నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి టీజీ భరత్

- October 25, 2024 , by Maagulf
నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి టీజీ భరత్

కర్నూలు: కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్యం శాఖల మంత్రి టి.జి. భరత్, నగర మేయర్ బి.వై.రామయ్య అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్బిఐ కాలనీలోని కౌన్సిల్ హాలులో మేయర్ అధ్యక్షతన నగర పాలక పాలకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రితో పాటు ఎమ్మెల్యేలు గౌరు చరిత రెడ్డి, బొగ్గుల దస్తగిరి, కమిషనర్ ఎస్.రవీంద్రబాబు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ… నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, వీలైనంతవరకు ప్రజలకు పగటిపూటే నీళ్ళు అందించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. పేద ప్రజలకు కమ్యూనిటీ భవనాలు ఎంతో అవసరమని, నగరంలో పలుచోట్ల కమ్యూనిటీ భవనాల్లో ఉన్న సచివాలయాలను ఖాళీ చేసి వేరే ప్రదేశానికి మార్చాలని ఆదేశించారు. నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకు సంబంధించి ఇటీవల జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు లేఖ సైతం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈకార్య‌క్ర‌మంలో మేయర్, ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కమిషనర్ లు పాల్గొని మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, ఆరోగ్యాధికారి కె.విశ్వేశ్వర్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎస్ఈ రాజశేఖర్, ఆర్ఓలు జునైద్, ఇజ్రాయిల్, అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్, ఎగ్జామినర్ సుబ్రహ్మణ్యం, పబ్లిక్ హెల్త్ ఈఈ చంద్రమోహన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com