బుర్జ్‌ ఖలీఫాకు పోటీగా 1000 మీటర్ల ఎత్తుతో జెడ్డా టవర్స్‌

- October 25, 2024 , by Maagulf
బుర్జ్‌ ఖలీఫాకు పోటీగా 1000 మీటర్ల ఎత్తుతో జెడ్డా టవర్స్‌

రియాద్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫా. ఇది దుబాయ్ లో ఉంది. 828 మీటర్లు (2,717 అడుగులు) ఎత్తయిన ఈ భవనం 2004లో నిర్మాణం ప్రారంభమై 2009లో పూర్తయింది. 2010 జనవరిలో ప్రారంభించబడిన ఈ భవనం నివాస, వాణిజ్య, హోటల్‌ అవసరాలకు ఉపయోగపడుతుంది. వీటిలో అత్యంత ఎత్తైన భవనం, అత్యధిక అంతస్తులు, మరియు పొడవైన ఎలివేటర్‌ ప్రయాణం ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అనేక రికార్డులు కలిగి ఉన్న బుర్జ్ ఖలీఫా భవనానికి పోటీగా ఇప్పుడు సౌదీ అరేబియాలో మరో భవనం నిర్మాణం జరుపుకుంటున్నది. ప్రపంచం అబ్బురపడేలా అత్యంత ఎత్తైన, ఆకర్షణీయమైన కొత్త భవనాన్ని 1.23 బిలియన్‌ డాలర్లు (సుమారుగా రూ.10వేల కోట్లు) ఖర్చు చేసి ‘జెడ్డా ఎకనమిక్‌ కంపెనీ’ నిర్మిస్తున్నది.

జెడ్డా టవర్స్‌’గా పిలుస్తున్న ఈ భవనం ఎత్తు 1000 మీటర్లు ఉంటుందని తెలిసింది. అంటే భూమి నుంచి ఆకాశంలో ఒక కిలోమీటరు ఎత్తు అన్నమాట. దుబాయ్‌ నడిబొడ్డున 2010లో నిర్మించిన బుర్జ్‌ ఖలీఫా ఎత్తు 828 మీటర్లు. ఇది గత 14 ఏండ్లుగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా కొనసాగుతున్నది. జెడ్డా టవర్స్‌ పూర్తి అయిన తర్వాత, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా నిలుస్తుంది. ఈ భవనం నిర్మాణం ప్రపంచం మొత్తం అబ్బురపడేలా ఆకర్షణీయంగా ఉంటుంది.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com