ఇకపై ఇంటి దగ్గరికే TGSRTC కార్గో సేవలు - మంత్రి పొన్నం
- October 26, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (TGSRTC) ఇకపై ఇంటి దగ్గరికి కార్గో సేవలను అందించనుంది.ఈ సేవలను హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి, 27 అక్టోబర్ 2024 నుండి హోం డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. త్వరలోనే ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈ విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “మా ప్రభుత్వానిది ప్రజాపాలన. మహిళల ప్రభుత్వమని, ఆర్టీసీ సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాం అని తెలిపారు.త్వరలోనే 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం. విద్యుత్ బస్సుల కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం” అని తెలిపారు.త్వరలోనే TGSRTC కార్గో సేవలు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







