టెర్రర్ ఫైనాన్సింగ్‌పై పోరు..ఒమన్ చర్యలకు ప్రశంసలు..!!

- October 27, 2024 , by Maagulf
టెర్రర్ ఫైనాన్సింగ్‌పై పోరు..ఒమన్ చర్యలకు ప్రశంసలు..!!

పారిస్: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) అక్టోబర్ 21 - 25వరకు పారిస్‌లో జరిగిన గ్రూప్ సమావేశంలో ఒమన్ సుల్తానేట్‌లోని యాంటీ మనీ లాండరింగ్, కౌంటర్ టెర్రరిజం ఫైనాన్సింగ్ సిస్టమ్స్ నివేదికపై చర్చించారు. మనీలాండరింగ్ నిరోధక, ఉగ్రవాద వ్యతిరేక ఫైనాన్సింగ్ వ్యవస్థ అభివృద్ధికి ఒమన్ తీసుకున్న చర్యలు, ప్రయత్నాలను ప్రశంసించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై టాస్క్ ఫోర్స్ సంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా చట్టపరమైన న్యాయపరమైన సహాయానికి సంబంధించిన అంశాలలో అంతర్జాతీయ సహకారం, తీవ్రవాద ఫైనాన్సింగ్ నేరాలను ఎదుర్కోవడం, ఆర్థిక ఆంక్షలను అమలు చేయడం విషయంలో మెరుగైన చర్యలు తీసుకున్నారని కొనియాడారు. అంతకుముందు మనీ లాండరింగ్, టెర్రరిజం ఫైనాన్సింగ్‌ను ఎదుర్కోవడం కోసం తీసుకున్న చర్యలను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తాహిర్ సలీమ్ అల్ అమ్రీ వివరించారు.  నేరస్థుల దోపిడీ నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రక్షించడంలో దోహదపడేలా ఈ వ్యవస్థ ప్రపంచంలోని మిగిలిన దేశాలతో షేర్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు.ఒమన్ సుల్తానేట్ ఆమోదించిన జాతీయ వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని, మనీలాండరింగ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ నేరాలను ఎదుర్కోవడానికి వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఒమన్ సుల్తానేట్ విజయం సాధించిందని చెప్పారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com