భారత్తో కువైట్ విమానయాన సహకారం.. కీలక చర్చలు..!!

- October 27, 2024 , by Maagulf
భారత్తో కువైట్ విమానయాన సహకారం.. కీలక చర్చలు..!!

కువైట్ః కువైట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) హెడ్ షేక్ హుమూద్ ముబారక్ అల్-హుమూద్ అల్-జాబర్ అల్-సబాహ్.. భారత పౌర విమానయాన అథారిటీ అండర్ సెక్రటరీ అసంగ్బా చుబాతో సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలను పెంచడానికి ఒప్పందంపై సంతకం చేయడానికి కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖతో భారత అధికారులు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారతదేశం - కువైట్ మధ్య విమాన కార్యకలాపాలను పెంచడం కువైట్ ఎయిర్లైన్స్కు అత్యున్నత ప్రాధాన్యత అని పేర్కొన్నారు. మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ కాన్ఫరెన్స్ (ICAO 2024) వార్షిక సమావేశం ముగింపు సమావేశాల సందర్భంగా ఈ సమావేశం జరిగింది. అదేవిధంగా ఉగాండా, రువాండా, డొమినికన్ రిపబ్లిక్, ఒమన్తో సహా విమానయాన పరిశ్రమ అధికారులతో షేక్ హుమూద్ సమావేశమయ్యారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com