5 కొత్త బ్రిడ్జిలతో దుబాయ్ ఐకానిక్ ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్

- October 27, 2024 , by Maagulf
5 కొత్త బ్రిడ్జిలతో దుబాయ్ ఐకానిక్ ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్

దుబాయ్: దుబాయ్‌లోని ఐకానిక్ ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్‌ను ప్రధాన కూడలిగా మార్చేందుకు Dh696 మిలియన్ దిరహం తో ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఐదు కొత్త వంతెనలు నిర్మించబడతాయి. ఈ వంతెనలు మొత్తం 5,000 మీటర్ల పొడవు కలిగి ఉంటాయి. దుబాయ్ రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ట్రాఫిక్ ఆలస్యం సమయం 12 నిమిషాల నుండి కేవలం 90 సెకన్లకు తగ్గుతుందనీ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ట్రాఫిక్ రద్దీ మెరుగుపడటమే కాకుండా ప్రధాన రహదారుల మధ్య అనుసంధానం సులభమవుతుంది.

ఈ ప్రాజెక్ట్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC) మరియు దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) వంటి ముఖ్యమైన ప్రాంతాలకు సేవలు అందిస్తుంది. ఇది దుబాయ్‌లోని సుమారు 5 లక్షల మంది నివాసితులు మరియు సందర్శకులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
ఈ ప్రాజెక్ట్ దుబాయ్ నగర అభివృద్ధికి మరియు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పవచ్చు.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com