యూఏఈ వెదర్.. పలు ప్రాంతాల్లో వర్షాలు..!!
- October 27, 2024
యూఏఈః యూఏఈ తూర్పు మరియు దక్షిణ ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) వెల్లడించింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని పేర్కొంది. సోమవారం ఉదయం కూడా కొన్ని ప్రాంతాలలో వాతావరణం తేమగా ఉంటుందని తెలిపింది. గాలులు తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు. సముద్రం మీద బలమైన గాలులు వీస్తాయని, దీని వలన ధూళి చెలరేగే అవకాశం ఉందన్నారు. అరేబియా గల్ఫ్‌లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఒమన్ సముద్రంలో కొంచెం నుండి మోస్తరుగా ఉంటుందని తెలిపారు. దేశంలోని పర్వత ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 19°Cకి పడిపోతాయని, అదే సమయంలో అంతర్గత ప్రాంతాల్లో గరిష్టంగా 36°Cకి చేరుకుంటాయన్నారు. అబుదాబి, దుబాయ్‌లలో గరిష్టంగా 34 ℃ని నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల