బిగ్ ఎంటర్టైనర్: అవినాష్ అప్పుడలా.. ఇప్పుడిలా.!
- October 28, 2024
జబర్దస్త్ షోతో కమెడియన్‌గా పాపులర్ అయిన అవినాష్.. ఏ షోలో కనిపించినా హండ్రెడ్ పర్సంట్ ఎంటర్టైన్మెంట్ అది మాత్రం పక్కా.
మరి, ఎంటర్టైన్మెంట్కి కేరాఫ్ అడ్రస్ అయిన బిగ్‌బాస్ షోలో అవినాష్ వుంటే..! గతంలో ఓ సీజన్లో డైరెక్ట్‌గానే అవినాష్ హౌస్‌లో ఎంటర్టైన్ చేశాడు.
ఆ సీజన్ నాటికి అవినాష్‌కి పెళ్లి కాలేదు. ‘నాకింకా పెళ్లి కాలేదు’ అంటూ ఆ సీజన్లో తానున్నంత కాలం నవ్వులు పూయిస్తూనే వున్నాడు అవినాష్.
తాజా సీజన్లో అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో అవినాష్‌కి పెళ్లయ్యింది.
ఇప్పుడిదే టాపిక్ పదే పదే ఎత్తుతూ.. ‘నాకు పెళ్లయిపోయింది.. ఐ లవ్ యూ అనూ..’ అంటూ తన భార్య పేరునూ ఆమెపై తన ప్రేమను పదే పదే చాటుకుంటూ నవ్విస్తున్నాడు.
అవినాష్ ఏం చేసినా ఎంటర్టైన్మెంటే కదా.. ఆడియన్స్ దాన్ని మనస్పూర్తిగా స్వీకరిస్తున్నారు. బిగ్‌బాస్ లవర్స్ ఇష్టపడే ఎంటర్టైన్మెంట్ అంటేనే అలా వుండాలి మరి. ఆ విషయంలో అవినాష్ వందకు వంద మార్కులు వేయించుకుంటున్నాడు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







