ఏయన్నార్‌ అవార్డు నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం: చిరంజీవి

- October 28, 2024 , by Maagulf
ఏయన్నార్‌ అవార్డు నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం: చిరంజీవి

హైదరాబాద్: ఏయన్నార్‌ అవార్డు నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.మై గురు, మై మెంటర్ మై ఇన్స్పిరేషన్ అమితాబచ్చన్ చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు.ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్ర‌ధానోత్స‌వం కార్య‌క్ర‌మాన్ని సోమ‌వారం అన్న‌పూర్ణ స్టూడియోలో ఘ‌నంగా నిర్వ‌హించారు. 2024గానూ ఈ పుర‌స్కారం మెగాస్టార్ చిరంజీవికి ద‌క్కింది.

ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..మై గురు మై మెంటర్ మై ఇన్స్పిరేషన్ అమితాబచ్చన్ కి ధన్యవాదాలు. ఆయ‌న చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప‌ద్మ భూష‌ణ్ అవార్డు వ‌చ్చిన‌ప్పుడు న‌న్ను చిత్ర ప‌రిశ్ర‌మ స‌న్మానించింది. ఆ స‌మ‌యంలో అమితాబ్ నా గురించి చిరంజీవి కింగ్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా అని చెప్పారు. ఆ మాట‌లు విన్నాక నాలో చిన్న వ‌ణుకు క‌నిపించింది. నా నోట మాట రాలేదు అని చిరంజీవి అన్నారు.

ఆ రోజు ఆయనకి తాను థాంక్స్ చెప్పానో లేదో కూడా తెలీదన్నారు. బాద్షా ఆఫ్ ఇండియన్ సినిమా అమితాబచ్చన్ నుంచి ఆ మాటలు రావడం ఎంతో ఆనందం క‌లిగిందన్నారు. ఆయ‌న మాట‌లు త‌న‌కు ఎంతో స్పూర్తినిచ్చాయ‌ని చెప్పారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌తో గ‌డిపిన ప్ర‌తి క్ష‌ణం ఎంతో విలువైన‌ది చిరంజీవి చెప్పారు.

మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి. సైరా సినిమాలో అమితాబచ్చన్ ఒక కామియో రోల్ చేశారు. ఆయన్ని ఎలా అడగాలో తెలియక ఒక చిన్న మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ చూసి వెంటనే ఆ క్యారెక్టర్ చేస్తానని చెప్పారు. సినిమా అంతా పూర్తయిన తర్వాత ఫార్మాలిటీస్ (పారితోషికం) గురించి అడిగాను. ‘నీపై ఉన్న ప్రేమతో చేశాను. యు ఆర్ మై ఫ్రెండ్. ఫార్మాలిటీస్ గురించి మాట్లాడొద్దు’ అని చెప్పారు. ఆ క్షణం మర్చిపోలేను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుడ్ని కోరుకుంటున్నాను అని చిరంజీవి అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com