గ్లోబల్ విలేజ్.. RTA బస్సు, అబ్రా సేవలు పునఃప్రారంభం..!!
- October 29, 2024
దుబాయ్: అక్టోబరు 16న ప్రారంభమైన గ్లోబల్ విలేజ్ 29వ సీజన్ (2024–2025) కోసం నాలుగు బస్ రూట్‌లు తిరిగి సేవలు అందిస్తున్నాయని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. గ్లోబల్ విలేజ్‌కి అనుసంధానించే బస్సు మార్గాలు క్రింది విధంగా ఉన్నాయి:
-రష్దియా బస్ స్టేషన్ నుండి రూట్ 102: ప్రతి 60 నిమిషాలకు ఒక సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
-యూనియన్ బస్ స్టేషన్ నుండి రూట్ 103: ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు నడుస్తుంది.
-ల్ ఘుబైబా బస్ స్టేషన్ నుండి రూట్ 104: ప్రతి 60 నిమిషాలకు ఒక సర్వీస్ ఉంటుంది.
-మాల్ ఆఫ్ ఎమిరేట్స్ బస్ స్టేషన్ నుండి రూట్ 106: ప్రతి 60 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.
గ్లోబల్ విలేజ్ సందర్శకులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా అనుభూతిని అందించడానికి కోచ్ బస్సులు కూడా ఈ మార్గాల్లో అందుబాటులో ఉన్నాయి.
గత సీజన్ గ్లోబల్ విలేజ్ బస్ సర్వీస్ 573,759 మంది ప్రయాణీకులకు అందించామని, ఇది మునుపటి సీజన్‌లో (2022 - 2023) 448,716 తో పోల్చితే రైడర్‌షిప్‌లో 22% పెరుగుదల నమోదు చేసిందని ఆర్టీఏ వెల్లడించింది.
టూరిస్ట్ అబ్రా సేవలు
RTA ఈ సీజన్ కోసం గ్లోబల్ విలేజ్‌లో తన ప్రసిద్ధ పర్యాటక అబ్రా సేవలను కూడా పునఃప్రారంభించింది. సీజన్ అంతటా అతిథులకు సేవ చేయడానికి రెండు విద్యుత్ శక్తితో పనిచేసే అబ్రాలను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల