రచ్చ గెలిచి ఇంట గెలిచిన చిరంజీవి.!

- October 29, 2024 , by Maagulf
రచ్చ గెలిచి ఇంట గెలిచిన చిరంజీవి.!

మొదట ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది సామెత. కానీ, అది మెగాస్టార్ చిరంజీవి విషయంలో రివర్స్ అయ్యింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన వజ్రోత్సవాల వేడుక అప్పట్లో చాలా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

పలువురు సినీ ప్రముఖులు, తారలు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ సందర్భంలోనే చిరంజీవికి దక్కిన లెజెండరీ అవార్డు పట్ల కొందరు అక్కసు గక్కగా చిరంజీవి ఆ అవార్డును అప్పుడు తిరస్కరించాల్సి వచ్చింది.

అయితే, ఇప్పుడు ఆయనను అక్కినేని పురస్కారం వరించింది. ప్రతీ ఏడాది లెజెండరీ నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు జ్హాపకంగా ఇచ్చే అవార్డు ఈ సారి మెగాస్టార్ చిరంజీవికి దక్కింది.

ఈ కార్యక్రమం సందర్భంగానే తన లెజెండరీ అవార్డు సంఘటనను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ అనే అభిమానంతో పాటూ, ఆయనకు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయ్. తాజాగా ఏఎన్నార్ అవార్డు కూడా.

ఇక ఇంతకన్నా కావాల్సిందేముంది.! ఆయన లెజెండ్ కాదు అనడానికి ఇంకేముంది.! ఎవరు అక్కసు చూపించినా ఆయన లెజెండ్ అంతే.! బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా నాగార్జున, మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డును అందించారు.

ఈ సందర్భంగానే చిరంజీవి.. తాను రచ్చ గెలిచి ఇంట గెలిచాను.. అనిపిస్తోంది ఈ అవార్డు అందుకుంటోంటే.. అని తన మనసులో మెదిలిని ఆనాటి ఆ చేదు జ్ఞాపకాన్ని నేడు తలచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com