లవ్ మూడ్‌లో నిఖిల్ సిద్దార్ద్.!
- October 29, 2024
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కల కన్నానే చెలీ..’ అంటూ హీరో సిద్ధార్ద్ ‘బొమ్మరిల్లు’ సినిమాలో తన హీరోయిన్ జెనీలియాని ఊహించుకుంటూ పాట పాడారు. అప్పట్లో ఈ పాట యూత్‌లో ఓ ట్రెండింగ్.
ఇప్పుడిదే లిరిక్‌ని తన సినిమాకి టైటిల్‌గా పెట్టుకుని మరో యంగ్ హీరో నిఖిల్ డ్యూయెట్ వేసుకుంటున్నాడు.
ఆయన నటిస్తున్న తాజా చిత్రమే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రుక్మిణీ వసంత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ‘హే తార..’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణ చైతన్య అద్భుతమైన లిరిక్స్ అందించగా, కార్తీక్, నిత్యశ్రీ ఆలపించారు.
కాగా, ప్రస్తుతం నిఖిల్ ‘స్యయంభూ’ అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఆ సినిమా సెట్స్‌పై వుండగానే తన తాజా సినిమా రిలీజ్‌ని ప్రకటించాడు.
ఈ సినిమా నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్ అండ్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందినట్లు ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తోంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







