మెడికవర్ హాస్పిటల్స్ వారిచే ఉచిత న్యూరాలజిస్ట్ కన్సల్టేషన్

- October 29, 2024 , by Maagulf
మెడికవర్ హాస్పిటల్స్ వారిచే ఉచిత న్యూరాలజిస్ట్ కన్సల్టేషన్

హైదరాబాద్: ప్రపంచ స్ట్రోక్ డే-ప్రపంచవ్యాప్తంగా ప్రతి 40 సెకన్లకు ఒక్కరు స్ట్రోక్ బారినపడుతున్నారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ వారిచే ఉచిత న్యూరాలజిస్ట్ కన్సల్టేషన్(30.10.2024 నుంచి 10.11.2024 అందిస్తున్నారు. 

అనంతరం వైద్యులు మాట్లాడుతు ప్రతి ఒక్కరు ఆరోగ్య పరీక్షలు ప్రతి సంవత్సరం చేసుకొని బీపీ మరియూ షుగర్స్ అధుపులో ఉంచుకోవాలని అన్నారు.
స్ట్రోక్ అనేది తెలియకుండానే ఒక వ్యక్తిని కుంగదీసే ప్రమాదకరమైనది. ‘బ్రెయిన్ స్ట్రోక్’ అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా వికలాంగుడిగా మారుస్తుంది. కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీస్తుంది. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ వారిచే  స్ట్రోక్‌కి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికి అవగాహనా కొరకు సమగ్ర స్ట్రోక్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ను నిర్వహించడం జరిగింది.ప్రపంచవ్యాప్తంగా ప్రతి 40 సెకన్లకు వ్యక్తులపై స్ట్రోక్ ప్రభావం చూపుతోంది, ఒక్క భారతదేశంలోనే వార్షికంగా 1.66 మిలియన్ల కొత్త కేసులు నమోదవుతున్నాయి.మరణాల రేటు పెరిగింది, 100,000 జనాభాకు 86.5 మరణాలు సంభవిస్తున్నాయి, స్ట్రోక్ భారతదేశంలో మరణానికి నాల్గవ ప్రధాన కారణం మరియు వైకల్యానికి ఐదవ ప్రధాన కారణం అని న్యూరాలజీ విభాగం వైద్యులు డాక్టర్ హరిరాధకృష్ణ, డాక్టర్ రంజిత్, డాక్టర్ విక్రమ్ కిషోర్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ అన్నారు.ఈ కార్యక్రమములో మెడికవర్ హాస్పిటల్స్ ఇతర వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com