బహ్రెయిన్ లో మొబైల్ ఫోన్ విక్రయాలపై కఠిన నిబంధనలు..!!

- October 30, 2024 , by Maagulf
బహ్రెయిన్ లో మొబైల్ ఫోన్ విక్రయాలపై కఠిన నిబంధనలు..!!

మనామా: మొబైల్ ఫోన్ విక్రయాలపై కఠిన నిబంధనలు అమలు చేసే దిశగా బహ్రెయన్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఐదుగురు బహ్రెయిన్ పార్లమెంట్ సభ్యులు (MPలు) నివాసితులు, సందర్శకులకు మొబైల్ ఫోన్ లైన్‌లను విక్రయించడం, బదిలీ చేయడంపై కఠినమైన నిబంధనలను అమలు చేయాలని కోరుతూ ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఎంపీలు బాస్మా ముబారక్, మహ్మద్ అల్ అహ్మద్, జలీలా అల్ సయ్యద్, హనన్ ఫర్దాన్, బాదర్ అల్ తమీమీ ప్రతిపాదించిన ప్రతిపాదన.. ఈ సమస్యను పరిష్కరించడంలో జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనాల ప్రాముఖ్యతను తెలియజేసింది. వివిధ నేరాలలో మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యలో ఈ చర్యలు అత్యవసరమని ఎంపీలు వెల్లడించారు.

అధునాతన సాంకేతికత, కమ్యూనికేషన్ యుగంలో ప్రజల భద్రతకు గణనీయమైన ముప్పు ఏర్పడుతుందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ క్రమంలో మొబైల్ ఫోన్ లైన్‌ల కొనుగోలు, అమ్మకాలపై కఠినమైన నియంత్రణలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇతర దేశాలలో విజయవంతంగా అమలవుతున్న నివాసితులు, సందర్శకుల కోసం కఠినమైన నిబంధనలను బహ్రెయిన్ అనుసరించాలని ఎంపీలు కోరారు.  సైబర్ క్రైమ్‌లను అరికట్టేందుకు, ఇటీవల పెరుగుతున్న చోరీ, ఫ్రాడ్ కేసులను అడ్డుకునేందుకు ఈ ప్రతిపాదన గణనీయంగా దోహదపడుతుందని ఎంపీలు వాదిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com