పాలస్తీనా సమస్య పరిష్కారానికి కృషి.. రియాద్ లో గ్లోబల్ కూటమి సమావేశం..!!
- October 30, 2024
రియాద్: పాలస్తీనాలో రెండు రాష్ట్రాల పరిష్కారం కోసం అంతర్జాతీయ కూటమి తన మొదటి సమావేశాలను సౌదీ రాజధాని రియాద్‌లో వచ్చే వారం నిర్వహించనున్నట్లు యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ వెల్లడించారు. గాజా యుద్ధాన్ని ముగించడం, బందీలను విడిపించేందుకు కృషి చేయడం, రెండు రాష్ట్రాల పరిష్కారం కోసం అన్ని దేశాలు పాల్గొనేందుకు ప్రపంచ కూటమిని ప్రారంభించామని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బార్సిలోనాలో జరిగిన 9వ ప్రాంతీయ ఫోరమ్‌లో ఈ మేరకు ఆయన తెలియజేశారు. రియాద్ సమావేశం తర్వాత, సంకీర్ణ కమిటీలు బ్రస్సెల్స్, కైరో, అమ్మాన్, ఇస్తాంబుల్, నార్వే రాజధాని ఓస్లోలో సమావేశం అవుతాయని తెలిపారు. గాజాలో పరిస్థితిని చర్చించడానికి రెండు-రాష్ట్రాల పరిష్కారాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని బోరెల్ సూచించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల