కార్నిష్ స్ట్రీట్, సబా అల్ అహ్మద్ కారిడార్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- October 30, 2024
దోహా: ఈ వారాంతంలో కార్నిచ్ నుండి రాస్ అబూ అబ్బౌద్ ఎక్స్‌ప్రెస్‌వే వరకు ఉన్న సొరంగాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది. దీనితోపాటు షార్క్ ఇంటర్‌సెక్షన్ నుండి హమద్ విమానాశ్రయం వరకు ఒక దిశలో ఉన్న మూడు లేన్‌లు నిర్వహణ పనుల కోసం నవంబర్ 1 ఉదయం 2 గంటల నుండి నవంబర్ 3 ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
అదేవిధంగా సబా అల్ అహ్మద్ కారిడార్‌లో ఉమ్ లేఖ్బా టన్నెల్ నుండి లెక్తైఫియా టన్నెల్ వరకు హమద్ విమానాశ్రయం వైపు తొమ్మిది గంటలపాటు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. అయితే, సర్వీస్ రోడ్లు, లెక్తైఫియా సిగ్నల్ తెరిచి ఉంటాయని తెలిపారు. నవంబర్ 1 ఉదయం 1 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు విమానాశ్రయం వైపు అల్ షమల్ రోడ్ కూడా తాత్కాలికంగా అందుబాటులో ఉండదని అధికారులు వెల్లడించారు. సబా అల్ అహ్మద్ కారిడార్‌ను యాక్సెస్ చేయడానికి ఉత్తరం లేదా అల్ మార్కియా నుండి రోడ్డు వాహనదారులు అల్ దుహైల్ ఇంటర్‌ఛేంజ్‌ని ఉపయోగించాలని సూచించారు. దోహా నుండి సబా అల్ అహ్మద్ కారిడార్‌కు వెళ్లే వాహనదారులు సర్వీస్ రోడ్‌లను చేరుకోవడానికి ఉమ్ లేఖ్‌బా ఇంటర్‌చేంజ్‌ని ఉపయోగించాలని కోరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల