కువైట్‌లోని కార్మికుల్లో అగ్రస్థానంలో భారతీయులు..!!

- October 30, 2024 , by Maagulf
కువైట్‌లోని కార్మికుల్లో అగ్రస్థానంలో భారతీయులు..!!

కువైట్: సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాల ప్రకారం.. ఈ సంవత్సరం రెండవ త్రైమాసికం చివరి నాటికి లేబర్ మార్కెట్ లో భారతదేశం నుండి 18,464 మంది కొత్త కార్మికులు చేరారు. దీంతో కువైట్‌లోని కార్మికుల సంఖ్యలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. మొత్తం భారతీయ కార్మికుల సంఖ్య 537,430 గా ఉంది. ఆ తర్వాత ఈజిప్టు కార్మికులు 8,288 మంది తగ్గారు. మొత్తం 474,102 మందికి చేరుకున్నారు. బంగ్లాదేశ్ కార్మికులు 12,742 మంది పెరిగి 180,017కి చేరుకొని నాలుగవ స్థానంలో ఉన్నారు.  నేపాల్ కార్మికులు 14,886 మంది(86,489 మంది) పెరుగుదలతో ఐదవ స్థానాన్ని పొందింది.  పాకిస్థానీ కు చెందిన 2,946 మంది కార్మికుల పెరుగుదలతో ఆరవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానలంలో ఫిలిపినోలు, సిరియన్లు, జోర్డానియన్లు, శ్రీలంక వాసులు ఉన్నారు. ఇదే కాలంలో కువైట్ కు చెందిన 4,531 మంది పురుషులు, మహిళలు లేబర్ మార్కెట్‌లోకి ప్రవేశించారు. ఈ సంవత్సరం జూన్ 30నాటికి రెండవ త్రైమాసికం ముగిసే సమయానికి ఉపాధి పొందిన పౌరుల సంఖ్య 451,595కి చేరుకుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com