చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!

- October 30, 2024 , by Maagulf
చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!

మనామా: సెహ్లా ప్రాంతంలోని షేక్ సల్మాన్ హైవే వెంబడి అనధికార ప్రదేశాలలో అమ్మకానికి ప్రదర్శనకు పెట్టిన వాహనాలను అక్కడి నుంచి తొలగించాలని క్యాపిటల్ మునిసిపల్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొనాలి. ఈ మేరకు మునిసిపాలిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. నోటీసు వ్యవధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు పాటించన వారిపై జరిమానాలను విధించనున్నట్లు పేర్కొన్నారు.  ఈ అమలు చర్య చట్టబద్ధమైన యూజ్డ్ కార్ డీలర్‌షిప్‌ల యజమానుల నుండి వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు చేపట్టి నోటీసులు జారీ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com