ఫుట్‌బాల్ ఆటగాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- October 30, 2024
యూఏఈ: అక్టోబర్ 20న అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో ఘర్షణకు పాల్పడిన ముగ్గురు ఫుట్‌బాల్ ఆటగాళ్లకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించారు. యూఏఈ, ఈజిప్ట్‌ల మధ్య ఉన్న సోదర సంబంధాల ఆధారంగా దోషులను క్షమించాలనే నిర్ణయం తీసుకున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. ఈజిప్షియన్ జమాలెక్ క్లబ్‌కు చెందిన దోషులుగా తేలిన ఆటగాళ్లకు ఒక నెల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి Dh200,000 జరిమానా విధించారు.
అక్టోబర్ 21న అబుదాబిలో జరిగిన పిరమిడ్స్ క్లబ్‌తో జరిగిన ఈజిప్షియన్ సూపర్ కప్ సెమీ-ఫైనల్‌లో మ్యాచ్‌లో ప్లేయర్స్ పబ్లిక్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. నబిల్ ఎమాద్ డొంఘా, ముస్తఫా షాలబీ, ఫుట్‌బాల్ డైరెక్టర్ అబ్దెల్ వాహెద్ ఎల్ సయ్యద్‌లను నిందితులుగా గుర్తించారు. విచారణ సందర్భంగా ప్లేయర్స్ తమ తప్పును ఒప్పుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిర్ధారించి కోర్టు తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







