కువైట్‌కు 4 రోజులపాటు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎతిహాద్..!!
- October 30, 2024
యూఏఈ: కువైట్‌కు నాలుగు రోజులపాటు కొన్ని విమాన సర్వీసులను ఎతిహాద్ ఎయిర్‌వేస్ రద్దుచేసింది. అబుదాబి జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం (AUH), కువైట్ (KWI) మధ్య కొన్ని విమానాలు అక్టోబర్ 30 నుండి నవంబర్ 2 వరకు రద్దు చేసినట్టు ఎయిర్ లైన్స్ తెలిపింది.
రద్దయిన సర్వీసుల్లో EY 651 అబుదాబి నుండి కువైట్, EY 652 కువైట్ నుండి అబుదాబికి వెళ్లే విమాన సర్వీసు ఉంది. బాధిత కస్టమర్లకు ప్రత్యామ్నాయ విమానాల్లో తిరిగి వసతి కల్పించడానికి లేదా పూర్తి వాపసును అందించడానికి కృషి చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది.
ఈ విమానాలను బుక్ చేసుకున్న ప్రయాణికులు తమను etihad.com/manage సందర్శించడం ద్వారా సంప్రదించాలని కోరింది. అదే సమయంలో సర్వీసుల రద్దు సమాచారాన్ని చెక్ చేసుకోవాలని క్యారియర్ కోరింది. కాగా, విమాన నంబర్లు EY 657, EY 655, EY 653 అన్నీ అక్టోబర్ 30, 31, నవంబర్ 1 తేదీలలో అబుదాబి నుండి కువైట్‌కు యధాతథంగా పనిచేస్తున్నాయని తెలిపారు అదేవిధంగా, కువైట్ నుండి అబుదాబికి వచ్చే ప్రయాణికుల కోసం EY 656, EY 654, EY 658 విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







