సౌదీలో పెరుగుతున్న కార్మికుల మరణాలు..వాదనలను ఖండించిన సౌదీ అరేబియా..!!

- November 02, 2024 , by Maagulf
సౌదీలో పెరుగుతున్న కార్మికుల మరణాలు..వాదనలను ఖండించిన సౌదీ అరేబియా..!!

రియాద్:  దేశంలో పని ప్రదేశాల్లో పరిస్థితులు సరిగా లేక కార్మికుల మరణాలు పెరుగుతాయని  పలు మీడియా సంస్థల్లో వైరల్ అవుతున్న కథనాలను సౌదీ అరేబియాలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ గట్టిగా ఖండించింది.  సౌదీ అరేబియా  పని సంబంధిత మరణాల రేటు 100,000 మంది కార్మికులకు 1.12గా ఉందని, ప్రపంచవ్యాప్తంగా పని సంబంధిత మరణాల రేటు తక్కువగా ఉన్న దేశాలలో సౌదీ అరేబియా ఒకటని కౌన్సిల్ ధృవీకరించింది. ఈ పురోగతిని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) గుర్తించిందని, ఇది దాని అధికారిక వెబ్‌సైట్‌లో సౌదీ అరేబియా  వృత్తిపరమైన భద్రత , ఆరోగ్యంలో గణనీయమైన పురోగతిని ప్రశంసించింది. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిస్క్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్, బ్రిటీష్ సేఫ్టీ కౌన్సిల్‌తో సహా ఇతర ప్రసిద్ధ సంస్థలు ఈ వాదనలను సమర్తించటని పేర్కొంది. 

సౌదీ విజన్ 2030 ఫ్రేమ్‌వర్క్‌లోని కార్యక్రమాలు..ముఖ్యంగా ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ కోసం నేషనల్ స్ట్రాటజిక్ ప్రోగ్రామ్, అభివృద్ధి ప్రాజెక్టులలో మానవ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తాయి. 2017లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం కార్యాలయంలో భద్రతా ప్రమాణాలు, ప్రోటోకాల్‌లు, చట్టాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. సౌదీ కార్మిక చట్టాల ప్రకారం యజమానులు తమ వద్ద పనిచేసే వారికి ఆరోగ్య సంరక్షణ సేవలను కవర్ చేయడానికి వీలుగాసమగ్ర ఆరోగ్య బీమాను అందించాలి. దాంతో పాటు ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడానికి ILO ఒప్పందాలకు అనుగుణంగా పని గంటలు అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఉండేలా చూడాలని కౌన్సిల్ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com