స్పెయిన్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు..ఎమిరాటిస్లకు యూఏఈ కీలక సూచనలు..!!
- November 02, 2024
యూఏఈ: మాడ్రిడ్‌లోని యూఏఈ మిషన్.. వాలెన్సియా, కాటలోనియా, అండలూసియా, బలేరిక్ దీవులలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా స్పెయిన్‌లోని ఎమిరాటిస్లను జాగ్రత్తగా ఉండాలని కోరింది. స్పానిష్ అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను పాటించాలని, అత్యవసర సందర్భాల్లో 0097180024 లేదా 0097180044444 నంబర్లలో కమ్యూనికేట్ కావాలని సూచించారు. స్పెయిన్‌లో అత్యంత ఘోరమైన వరదలు సంభవించి.. వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా తూర్పు స్పెయిన్‌లో విధ్వంసకర వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 158కి చేరుకుంది. ఐదు దశాబ్దాల కాలంలో యూరప్‌లో సంభవించిన అత్యంత ఘోరమైన తుఫాను సంబంధిత విపత్తులో తప్పిపోయిన వారి కోసం రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల