రాబోయే రెండు రోజులపాటు సౌదీలో భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!

- November 03, 2024 , by Maagulf
రాబోయే రెండు రోజులపాటు సౌదీలో భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!

రియాద్: సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాలలో రాబోయే రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ (DGCD) అలెర్ట్ జారీ చేసింది. సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని.. వాగులు, లోయలు కలిసే ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది.  

జాతీయ వాతావరణ కేంద్రం (NCM) సూచన ప్రకారం.. మక్కా ప్రాంతంలోని హోలీ సిటీ, జెద్దా, అల్-జుముమ్, అల్-కామిల్, అల్-ఖోర్మా, తుర్బా, రాణియా, అల్-మువైహ్, కున్ఫుదా, అల్-లైత్, తైఫ్, మైసన్, అధమ్, అల్-అర్దియత్, బహ్రా, ఖులైస్, రబీగ్ పాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో వడగళ్లు పడే అవకాశం ఉంది.

రియాద్ ప్రాంతంలోని అఫీఫ్, అల్-కువయ్యా, అల్-దవద్మీ, అల్-జుల్ఫీ, అల్-ఘాట్, షఖ్రా, థాదిక్, మరాత్, అల్-మజ్మా,  రిమాతో సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని DGCD తెలిపింది. హౌతా బని తమీమ్, అల్-హరిక్, అల్-ముజాహ్మియా, అల్-ఖర్జ్, హరిమ్లా, అల్-దిరియా, ధర్మాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

మదీనా, హేల్, అల్-ఖాసిమ్, తబుక్, అల్-జౌఫ్, ఉత్తర సరిహద్దులు, తూర్పు ప్రావిన్స్, అల్-బహా, అసిర్, జజాన్ ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని డైరెక్టరేట్ తెలిపింది. జజాన్ నగరం, ఫరాసన్ గవర్నరేట్‌లతో సహా దక్షిణ జజాన్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు.  ఇదిలా ఉండగా జజాన్, అసిర్, అల్-బాహా, మక్కా, మదీనా, ఖాసిమ్, హేల్, ఉత్తర సరిహద్దులు, అల్-జౌఫ్, రియాద్ ప్రాంతాలలో బలమైన గాలులతో దుమ్ము తుఫాన్ లు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురుస్తుందని NCM తెలిపింది.  మదీనా ప్రాంతంలోని యాన్బు, అల్-రైస్, అల్-మహద్, బద్ర్, వాడి అల్-ఫరా, అల్-అయిస్‌లో మోస్తరు వర్షం కురుస్తుందని NCM హెచ్చరించింది. అల్-జౌఫ్ ప్రాంతంలో భారీ వర్షాలు, బలమైన గాలులు.. అల్-ఖురయ్యాత్, తబర్జల్ గవర్నరేట్‌లు, ఓపెన్ ఏరియాలు, హైవేలలో వడగళ్ళు, ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని NCM హెచ్చరించింది. రిమోట్ ఏరియాలకు రెస్పాన్స్ టీమ్‌తో పాటు 14 అంబులెన్స్ టీమ్‌లు, రెండు కేర్ టీమ్‌లు, ఎయిర్ అంబులెన్స్ టీమ్‌తో పాటు, ఎమర్జెన్సీని ఎదుర్కొనేందుకు అదనపు సపోర్ట్ టీమ్‌లను సిద్ధం చేసినట్లు బ్రాంచ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మమ్‌దౌ అల్-రువైలీ వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com