ISF వరల్డ్ స్కూల్ జిమ్నాసియాడ్లో మెరిసిన భారతీయ అథ్లెట్లు..!!
- November 03, 2024
మనామా: మనామాలో అక్టోబర్ 23 నుండి 30 వరకు జరిగిన ISF వరల్డ్ స్కూల్ జిమ్నాసియేడ్లో పాల్గొన్న ఇండియాకు చెందిన 185 మంది యువ క్రీడాకారుల ప్రతినిధి బృందం రాణించింది. ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ (ISSO) ఇండియా నిర్వహించే ఈ ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ ప్రతిభను ఒక్కచోట చేర్చడం లక్ష్యం. అథ్లెట్లు ఆర్చరీ, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, చెస్, ఫెన్సింగ్, జూడో, కరాటే, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, టెన్నిస్లతో సహా అనేక విభాగాల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. భారత జట్టు రెండు బంగారు పతకాలు, నాలుగు రజత పతకాలు, ఆరు కాంస్య పతకాలు సాధించి అంతర్జాతీయ వేదికపై తనదైన ముద్ర వేసింది. అక్టోబర్ 29న భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించి ‘విజిట్ ఎంబసీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయబారి వినోద్ కె. జాకబ్ యువ క్రీడాకారులతో సమావేశమయ్యారు. విద్యార్థులకు రాయబార కార్యాలయం నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







