ఒమన్‌లో నిధుల సేకరణ కోసం కొత్త నిబంధనలు..!!
- November 04, 2024
మస్కట్: ధార్మిక నిధుల సేకరణ కార్యకలాపాలను నియంత్రించే లక్ష్యంతో, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MOSD) ప్రజల నుండి డబ్బు వసూలు చేయాలనుకునే ప్రైవేట్ సంస్థలకు కొత్త నిబంధనలను విధించింది. ఏదైనా నిధుల సేకరణ కార్యకలాపాలను ప్రారంభించే ముందు ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా MOSD నుండి లైసెన్స్ పొందాలని నిర్దేశించారు. అయితే, పబ్లిక్ లీగల్ ఎంటిటీలు ఏర్పాటు చేసిన కమిటీలు, సంస్థలు చేపట్టే నిధులకు ఈ నియమం వర్తించదని అధికారులు తెలిపారు. అనుమతి పొందిన సంస్థలు విరాళాల సేకరణకు అప్లికేషన్లు, వెబ్సైట్ల వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవచ్చు. నిధుల సేకరణ ప్రారంభించిన తర్వాత 15 పనిదినాల్లోగా సంస్థలు నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. నిధులను తప్పనిసరిగా ఉద్దేశించిన ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి. నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించి సేకరించిన నిధులను మంత్రిత్వ శాఖ స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల