డిసెంబర్ వరకు స్వచ్ఛంద చమురు కోతలను పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- November 04, 2024
రియాద్: సౌదీ అరేబియాతోపాటు ఏడు ఇతర ఒపెక్ + దేశాలు డిసెంబరు 2024 చివరి వరకు రోజుకు 2.2 మిలియన్ బ్యారెల్స్ (బిపిడి) అదనపు చమురు స్వచ్ఛంద కోతలను మరో నెల పాటు పొడిగించాలని నిర్ణయించాయి. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ ఒపెక్ దేశాలు నవంబర్ 2023లో ప్రకటించిన స్వచ్ఛంద చమురు కొతకు 2.2 మిలియన్ బిపిడి పొడిగించడానికి అంగీకరించాయని ఒపెక్ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో తెలిపింది. 3 ఏప్రిల్ 2024న జరిగిన దాని 53వ సమావేశంలో జాయింట్ మినిస్టీరియల్ మానిటరింగ్ కమిటీ అదనపు స్వచ్ఛంద చమురు ఉత్పత్తి సర్దుబాట్లను కొనసాగించాలని నిర్ణయించింది. ఆగస్టులో సౌదీ అరేబియా, రష్యా, యూఏఈ, కువైట్, అల్జీరియా, ఒమన్, ఇరాక్, కజకిస్తాన్ లు రెండు దఫాలుగా చర్చలు జరిపాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల