ఖతార్ ఒలింపిక్, స్పోర్ట్స్ మ్యూజియంలో 'ది రేస్ ఈజ్ ఆన్' ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- November 05, 2024
దోహా: 3-2-1 ఖతార్ ఒలింపిక్, స్పోర్ట్స్ మ్యూజియం (QOSM)లో 'ది రేస్ ఈజ్ ఆన్' ఎగ్జిబిషన్‌ను ఖతార్ మ్యూజియంల చైర్పర్సన్ HE షేఖా అల్ మయస్సా బింట్ హమద్ అల్ థానీ ప్రారంభించారు. ఎగ్జిబిషన్ ఖతార్ మోటార్‌స్పోర్ట్ చరిత్రను గుర్తు చేస్తుంది. దేశంలో ఫార్ములా 1 కోసం కొత్త శకాన్ని కళ్లకు కడుతుంది. ఈ థ్రిల్లింగ్ డిస్ప్లే యూకేల సిల్వర్‌స్టోన్ మ్యూజియం, భవిష్యత్ ఖతార్ ఆటో మ్యూజియంతో సహా కీలక భాగస్వాముల సహకారంతో ప్రదర్శన ఏర్పాటు చేశారు.
QOSMs E8 ఎగ్జిబిషన్ గ్యాలరీలో ఏప్రిల్ 1వరకు ఎగ్జిబిషన్ ఉంటుంది. నవంబర్ 29 నుండి డిసెంబర్ 1 వరకు ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్, ఫిబ్రవరి 1-2, 2025న జరిగే 2025 ఖతార్ ఇంటర్నేషనల్ ర్యాలీతో సమానంగా నిర్వహించనున్నారు. 1975లో మొదటి ఖతార్ మోటార్ ర్యాలీ నుండి లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో విజయవంతమైన ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ వరకు ఖతార్ మోటార్‌స్పోర్ట్ వారసత్వంలో ఈ ఓపెనింగ్ ఒక ముఖ్యమైన మైలురాయిని ఇక్కడ తెలుసుకోవచ్చు. రేస్ ఈజ్ ఆన్‌లో ఫార్ములా 1, ర్యాలీ ఛాంపియన్లు ధరించే రేసింగ్ సూట్లు, ట్రోఫీలు, గత రేసుల టైర్లు, లుసైల్ సర్క్యూట్ క్లిష్టమైన డిజిటల్ మోడల్, హెల్మెట్లు, మరిన్నింటితో సహా ప్రత్యేకమైన చారిత్రక అంశాలను ఒకేచోట చూడవచ్చు. హైలైట్ వస్తువులలో బ్రెజిలియన్ F1 డ్రైవర్, అయర్టన్ సెన్నాస్ హెల్మెట్ కూడా ఉంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!