బహ్రెయిన్ లో ఆక్రమణలపై ఉక్కుపాదం..రిఫ్ఫాలో నిర్మాణాల కూల్చివేత..!!

- November 07, 2024 , by Maagulf
బహ్రెయిన్ లో ఆక్రమణలపై ఉక్కుపాదం..రిఫ్ఫాలో నిర్మాణాల కూల్చివేత..!!

బహ్రెయిన్: సదరన్ మున్సిపాలిటీ అక్రమ రోడ్ల ఆక్రమణల తొలగింపు క్యాంపెయిన్ ను విజయవంతంగా కొనసాగిస్తుంది.  ఉపయోగించిన దుస్తులను సేకరించేందుకు ఉపయోగించే 500 పైగా లైసెన్స్ లేని కంటైనర్‌లను రీజియన్‌లోని వివిధ ప్రాంతాలు, నివాస సముదాయాల నుండి తొలగించారు.సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ,  పురపాలక సంఘం సమన్వయంతో రెండు నెలలకు పైగా కొనసాగిన తనిఖీ ప్రచారం జరిగిందని దక్షిణ మున్సిపాలిటీ వెల్లడించింది. అనుమతి లేకుండా పబ్లిక్ రోడ్‌లపై వస్తువులు, ప్రదర్శనలు, కియోస్క్‌లు లేదా ఇతర నిర్మాణాలను ఉంచడంపై నిషేధం ఉందని అధికారులు గుర్తుచేశారు.ఈ ప్రచారం మునిసిపాలిటీ విస్తృత పని ప్రణాళికలో భాగమన్నారు.ఇది ఉల్లంఘనలను తగ్గించడానికి, నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్నిప్రజలకు అవగాహన కల్పించడానికి నియంత్రణ, తనిఖీ చర్యలను అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com