యూఏఈలో పెరిగిన చేపల ధరలు?

- November 08, 2024 , by Maagulf
యూఏఈలో పెరిగిన చేపల ధరలు?

యూఏఈ: కొనసాగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చేపల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెప్పారు. అబుదాబి, దుబాయ్, షార్జా అంతటా మార్కెట్‌లలో తాజా చేపల ధరలు పెరిగాయని, కల్బా , ఖోర్ ఫక్కన్‌లోని వ్యాపారులు మాత్రం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.  అబుదాబి నివాసి ముహమ్మద్ యాకూబ్ మాట్లాడుతూ.. ఒక మాల్ నుండి క్రమం తప్పకుండా తాజా ఫిష్ లను కొనుగోలు చేస్తానని,  ఈసారి చేపల కోసం 70 శాతం ఎక్కువ చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు.   అల్ ఖుసైస్‌లోని లులు గ్రామ నివాసి అయిన మహమ్మద్ ఖలీద్ మాట్లాడుతూ.. కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలను కొనుగోలు చేయడానికి ప్రతి రెండు వారాలకు డీరా వాటర్‌ఫ్రంట్ మార్కెట్‌ కు వెళ్తానని, అయితే ఇటీవల చేపల విభాగానికి వెళ్లిన సమయంలో తనకు ఇష్టమైన చేపల ధరలు రెట్టింపు కావడం గమనించినట్టు తెలిపాడు.  "ప్రాంతీయ వివాదం కారణంగా చాలా పడవలు సముద్రంలోకి వెళ్లడం లేదని, ఇది ధరల పెరుగుదలకు దారితీసిందని షాపు ఓనర్ చెప్పాడు." అని ఖలీద్ చెప్పారు. "ప్రతి పదిహేను రోజులకు, నేను సాధారణంగా సముద్రపు ఆహారం కోసం 200 దిర్హామ్‌లు వెచ్చిస్తాను.  8 కిలోల చేపలను పొందుతాను.  కానీ ఈసారి నేను కేవలం 4 కిలోలే వచ్చాయి." అని అతను చెప్పాడు. తాజా పెద్ద హామర్ ధర సాధారణంగా కిలోకు 25 నుండి 35 దిర్హాంల మధ్య ఉంటుందని, ఇప్పుడు చాలా స్టాల్స్‌లో  Dh55కి పెరిగిందని ఓ టెలికాం కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న అష్ఫాక్ తెలిపాడు. "సాధారణంగా కిలోకి Dh15 నుండి Dh20 వరకు విక్రయించబడే షేరీ, ఇప్పుడు Dh30 నుండి మొదలవుతుంది. అయితే సీబాస్, సీబ్రీమ్ ధర గతంలో Dh25 ఉంటే,  ఇప్పుడు Dh35కి విక్రయిస్తున్నాయి." అని ఓ షాపు విక్రేత అలంగర్ తెలిపాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com