ముస్లిమేతరుల ఇఫ్తార్ పార్టీ
- June 24, 2016
యూఏఈలో ముస్లిమేతరలు పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. దేశంలో వివిద మతాల మధ్య ఐక్యత చాటేలా ఈ కార్యక్రమం జరగడాన్ని పలువురు అభినందిస్తున్నారు. షార్జాలో సెంట్ మైకేల్స్ కేథలిక్ చర్చ్ బుధవారం, 500 మంది కార్మికులకు ఇఫ్తార్ విందును అందించింది. వివిధ మతాల మధ్య ఐకమత్యాన్ని చాటిచెప్పేందుకు పరిష్ ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు ప్రీస్ట్ ఫాదర్ వర్గీస్ చెంపోలి చెప్పారు. పోప్ ఫ్రాన్సిస్ 2016ను ఇయర్ ఆఫ్ మెర్సీగా ప్రకటించడంతో ఈ విందును ఆయన గౌరవార్ధం ఏర్పాటు చేశామన్నారాయన. చాలామంది కార్మికులు తొలిసారి ఈ చర్చ్‌లోకి అడుగు పెట్టారు. వారందరూ ఇఫ్తార్ విందు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇంకో వైపున గురునానక్ దర్బార్ గురుద్వారాలోనూ ఇఫ్తార్ విందు జరిగింది. ఈ టెంపుల్‌లో ఇఫ్తార్ విందు సందర్భంగా ఇస్లామిక్ స్పీకర్ అహ్మద్ హమీద్ మాట్లాడుతూ, వివిధ మతాల మధ్య ఐక్యతకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. మూడో ఏడాది వరుసగా తాము ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు గురునానక్ దర్బార్ గురుద్వారా ఛైర్మన్ సురేందర్ సింగ్ కందారి చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







