గీత రచయిత కన్నదాసన్ మనవడు కథానాయకుడిగా ..
- June 24, 2016
గీత రచయిత కన్నదాసన్ భౌతికంగా లేకపోయినా ఆయన పేరు మాత్రం తమిళ చిత్ర జగతిలో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. అంతటి మహాకవి వారసత్వం కవితారంగంలోకి రాకపోయినా, ఆయన మనవడు కథానాయకుడిగా రాణించడానికి ప్రయత్నించడం ఆహ్వానించదగ్గ విషయం.ఎస్ కన్నదాసన్ మనువడు ఆదవ్కన్నదాసన్ ఇప్పటికే పోన్మాలైపోళుదు చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. ఆ తరువాత యామెరుక్క భయమే చిత్రంలో నటించి విజయాన్ని అందుకున్నారు.తాజాగా తన తాత 90వ జయంతి సందర్భంగా తన నూతన చిత్రానికి సన్నాహాలు మొదలెట్టారు.ఈ చిత్రానికి వదనమే చంద్రబింబమో అనే టైటిల్ను నిర్ణయించారు. శ్రీనివాసన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఓం సినిమా సంస్థ నిర్మించనుంది. ముఖ్య పాత్రలో విచారణై చంద్రన్ నటించనున్న ఇందులో ప్రముఖ నాయకితో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం తమిళ చిత్ర పరిశ్రమ, అంతర్జాతీయ సినిమాకు చెందిన వారు నటించనున్నారని చిత్ర యూనిట్ తెలిపారు. శంకర్ టక్కర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ వదనమే చంద్రబింబిమో చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర నిర్మాణ నిర్వాహకుడు గోపీక్రి ష్ణన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







