ఉల్లి, వెల్లుల్లి రెండూ తల్లిలాంటివే
- July 08, 2015
మనకి వంటింటిలో ఉల్లిపాయ ఉపయోగం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఉల్లిపాయ లేని కూర రుచించదు. అందుకే ఉల్లిని ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. అయితే ఈ మాట ఒక్క ఉల్లిపాయకే కాదు. వెల్లుల్లికి వర్తిస్తుంది. ప్రతీరోజూ ఉల్లి, వెల్లుల్లి పాయలు రెండూ ఎక్కువగా ఉపయోగించే వారికి, అస్సలు వీటిని ఉపయోగించని వారికి మధ్య తేడాను పరీక్షించి చూస్తే వాడని వారిలో ప్లేగు సంబంధిత కాన్సర్ రావడానికి అరవై శాతం ఎక్కువ అవకాశం ఉందని గుర్తించారట. వెల్లుల్లిలో సల్ఫర్, ఉల్లిలోని ఫ్లవనాయిడ్లూ అనేక రకాల కాన్సర్ నివారణ కారకాలుగా పని చేస్తాయట. ఇవి శరీరంలో ఎక్కడా కణితులు రాకుండా చెయ్యడం వల్ల తద్వారా వచ్చే కాన్సర్‌ను అదుపులో ఉంచడానికి తోడ్పడుతాయి. అంతే కాదు మన పెద్దవాళ్లు బాలింతలకు ఖచ్చితంగా తమ ఆహారంలో పత్యంగా వెల్లుల్లిని వాడతారు. తద్వారా ఆ సమయంలో వచ్చే గర్భాశయ సంబంధిత సమస్యలు రాకుండా ఉండడానికి ఇవి ఎంతో తోడ్పడుతాయి. అంతే కాదు మూత్రపిండాలను శుద్ధి చేసి, శరీరంలో బాక్టీరియాలాంటి సూక్ష్మ క్రిములు చేరకుండా కూడా అడ్డుకుంటాయి. అందుకే ఖచ్చితంగా ప్రతిరోజూ ఉల్లి, వెల్లుల్లిని వాడేలా చూసుకుంటే మంచిది.
తాజా వార్తలు
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!









