సౌదీ అరేబియా సైనిక వ్యయంలో 19.35% స్థానికీకరణ..!!

- November 22, 2024 , by Maagulf
సౌదీ అరేబియా సైనిక వ్యయంలో 19.35% స్థానికీకరణ..!!

రియాద్:  సౌదీ అరేబియా తన సైనిక వ్యయంలో 19.35% స్థానికీకరించింది.  ఇది 2018లో 4% నుండి గణనీయమైన పెరుగుదలగా గుర్తింపు పొందింది. 2030 నాటికి 50% కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. రియాద్‌లోని 2024 స్థానిక కంటెంట్ ఫోరమ్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో జనరల్ అథారిటీ ఫర్ మిలిటరీ ఇండస్ట్రీస్ (GAMI) గవర్నర్ అహ్మద్ అల్-ఓహలీ ఈ మేరకు వెల్లడించారు.

అల్-ఓహాలీ సైనిక పరిశ్రమల విభాగంలో లైసెన్స్ పొందిన సంస్థల వృద్ధిని హైలైట్ చేసారు. ఇది ఇప్పుడు Q3 2024 నాటికి 296గా ఉందని పేర్కొన్నారు. మానవరహిత వైమానిక వాహనాలు (UAVలు), ర్యాపిడ్ ఇంటర్‌సెప్టర్ బోట్లు,రక్షణ వ్యవస్థల నిర్వహణ వంటి ప్రాజెక్టుల కోసం దేశీయ కంపెనీలకు SR13 బిలియన్లు ($3.4 బిలియన్లు) కేటాయించారని చెప్పారు. స్థానిక కంటెంట్ డెవలప్‌మెంట్ సౌదీ విజన్ 2030కి మూలస్తంభంగా ఉందని, సైనిక రంగం 38% స్థానిక కంటెంట్ రేటును సాధిస్తుందని అల్-ఓహాలీ పేర్కొన్నారు. GDPకి రంగం యొక్క సహకారం SR5 బిలియన్లు ($1.3 బిలియన్లు)గా అంచనా వేయబడింది. 

స్థానిక కంటెంట్‌కు మరింత మద్దతు ఇవ్వడానికి GAMI  సిద్ధమవుతుంది. సైనిక దుస్తులు, పరికరాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రితో సహా 70 వర్గాలకు సంబంధించిన నాలుగు ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాలు ఇప్పటికే SR1 బిలియన్ ($266.6 మిలియన్) విలువైన ఒప్పందాలను రూపొందించాయి. దీని వలన 20% ఖర్చు ఆదా అవుతుందని భావించారు. ఒప్పందాలు SR1.6 బిలియన్లకు ($426.6 మిలియన్లు) పెరుగుతాయని అంచనా  వేశారు.   లైసెన్సింగ్ ప్రక్రియలను సులభతరం చేయడానికి మరియు స్థానిక , అంతర్జాతీయ కంపెనీలకు ఆకర్షణీయమైన పెట్టుబడి వాతావరణాన్ని సృష్టించడానికి అల్-ఓహలీ ప్రయత్నాలను చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com