యూఏఈ జాతీయ దినోత్సవం.. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు 4 రోజుల బ్రేక్..!!

- November 22, 2024 , by Maagulf
యూఏఈ జాతీయ దినోత్సవం.. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు 4 రోజుల బ్రేక్..!!

యూఏఈ:  యూఏఈ ప్రభుత్వ ఉద్యోగులు ఈ సంవత్సరం జాతీయ దినోత్సవ వేడుకల కోసం 4 రోజుల బ్రేక్ ను పొందుతారు. డిసెంబరు 2, 3 తేదీల్లో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం-ఆదివారం వారాంతంతో కలిపి జాతీయ దినోత్సవ బ్రేక్ నాలుగు రోజుల వీకెండ్  అవుతుంది. మంత్రిత్వ శాఖలు, సమాఖ్య సంస్థలలో రెగ్యులర్ పని గంటలు డిసెంబర్ 4 నుండి తిరిగి ప్రారంభమవుతాయని ప్రభుత్వం తెలిపింది.  1971లో ఎమిరేట్స్ ఏకీకరణను జరుపుకోవడానికి యూఏఈ ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సంవత్సరం దేశం 53వ ఏట అడుగుపెట్టింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com