రియాద్ మెట్రో.. త్వరలో మొదటి దశ కార్యకలాపాలు ప్రారంభం..!!

- November 23, 2024 , by Maagulf
రియాద్ మెట్రో.. త్వరలో మొదటి దశ కార్యకలాపాలు ప్రారంభం..!!

రియాద్: నవంబర్ 27న రియాద్ మెట్రో అధికారిక ప్రారంభానికి సిద్ధమవుతోంది.  మొదటి దశలో మూడు లైన్లలో కార్యకలాపాలు ఉంటాయని, మిగిలిన మూడు లైన్లు డిసెంబర్ లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. రియాద్ మెట్రో..ప్రపంచంలోనే అత్యంత పొడవైన డ్రైవర్‌లెస్ మెట్రో సిస్టమ్‌గా గుర్తింపు పొందనుంది.  రియాద్‌ను వాణిజ్యం, వ్యాపారానికి కేంద్రంగా మార్చడానికి మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా మెట్రో ప్రారంభం కానుంది.  ఇక మెట్రో స్టేషన్లు, డిపోలలో అమర్చిన సోలార్ ప్యానెల్లు కీలక విద్యుత్ వ్యవస్థలకు అవసరమైన 20% శక్తిని ఉత్పత్తి చేస్తాయని అధికారులు తెలిపారు.  

నవంబర్ 27న ప్రారంభం కానున్న మెట్రో ప్రారంభ మార్గాలు: అల్-ఒరౌబా నుండి బాతా, కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రోడ్, అబ్దుల్‌రహ్మాన్ బిన్ ఔఫ్ స్ట్రీట్ నుండి షేక్ హసన్ బిన్ హుస్సేన్ స్ట్రీట్ కూడలి. కింగ్ అబ్దుల్లా రోడ్, అల్-మదీనా, కింగ్ అబ్దుల్ అజీజ్ రోడ్‌ల వెంట ఉన్న లైన్లు డిసెంబర్ మధ్యలో ప్రారంభించబడతాయి.  $22.5 బిలియన్ల (SR84.4 బిలియన్) రియాద్ మెట్రో ప్రాజెక్ట్‌ను సౌదీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏప్రిల్ 2012లో ఆమోదించింది. 2013లో మూడు గ్లోబల్ కన్సార్టియమ్‌లకు బాధ్యతలు అప్పగించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com