రిటైర్ కు ముందట..Dh100,000 గెలుచుకున్న నిర్మాణ కార్మికుడు..!!

- November 23, 2024 , by Maagulf
రిటైర్ కు ముందట..Dh100,000 గెలుచుకున్న నిర్మాణ కార్మికుడు..!!

యూఏఈ: ఆడవల్లి గంగనా ఆడవల్లి.. ఇటీవల రెండవ ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డును అందుకోవడం అతని జీవితంలో ఒక కీలక మలుపు. డార్విష్ ఇంజినీరింగ్ ఎమిరేట్స్‌లో 53 ఏళ్ల నిర్మాణ కార్మికుడుగా సేవలు అందిస్తున్నాడు. అతను గత 24 సంవత్సరాలుగా కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆడవల్లి మాట్లాడుతూ.. తాను 24 సంవత్సరాల క్రితం యూఏఈకి వచ్చి నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నట్లు తెలిపారు.  నిర్మాణ రంగం విభాగంలో తాను సాధించిన విజయం గురించి అడవల్లికి అతని మేనేజర్ నుండి కాల్ వచ్చినప్పుడు, అతను దానిని పెద్ద జోకుగా భావించాడు. ‘‘విజేతలు దేశాభివృద్ధికి చేసిన కృషికి Dh100,000 బహుకరిస్తారని నేను తెలుసుకున్నాను. నేను చాలా ఆశ్చర్యపోయాను” అని ఆడవల్లి అన్నారు.  మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) ఏటా నిర్వహించే ఈ అవార్డులు ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీవన నాణ్యతను మెరుగుపరడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డు కూడా కార్మిక మార్కెట్ పోటీతత్వాన్ని పెంపొందించడానికి, ఉత్పాదకతను పెంచడానికి ఉపయోగపడుతుందన్నారు. “నేను పదవీ విరమణ చేయబోతున్నందున, ఈ మొత్తం నా రిటైర్‌మెంట్ జీవితాన్ని ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. నాకు చేతనైనంత కాలం పని చేస్తూనే ఉంటాను. చివరికి మా ఊరిలోనే స్థిరపడతాను.’’ అని ఇద్దరు కుమార్తెలు ఉన్న ఆడవల్లి అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com