సోమాలియా నాసో హబ్లోద్‌ హోటల్‌పై ఉగ్రదాడి

- June 25, 2016 , by Maagulf
సోమాలియా  నాసో హబ్లోద్‌ హోటల్‌పై ఉగ్రదాడి

సోమాలియా రాజధాని మొగాదిషులోని నాసో హబ్లోద్‌ హోటల్‌పై ఉగ్రవాదులు తెగబడ్డారు. తొలుత హోటల్‌ బయట కారు బాంబు దాడి చేశారు. అనంతరం హోటల్‌లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భద్రతాబలగాలు హోటల్‌ను చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు, భద్రతాసిబ్బందికి మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
అయితే ఉగ్రదాడిలో ఎంతమంది మృతిచెందారన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు. అల్‌ఖైదాకు చెందిన అల్‌షబబ్‌ ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. హోటల్‌లో చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. హోటల్‌ నుంచి కాల్పులు, భారీ పేలుడు శబ్ధాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. మొగాదిషులోని పలు హోటళ్లపై గతంలోనూ ఉగ్రకాల్పులు జరిగిన ఘటనలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com