రేపు లండన్లో ఒమన్ జ్యువెల్ ఆఫ్ అరేబియా ఎక్స్‌పెడిషన్ ప్రారంభం

- November 24, 2024 , by Maagulf
రేపు లండన్లో ఒమన్ జ్యువెల్ ఆఫ్ అరేబియా ఎక్స్‌పెడిషన్ ప్రారంభం

మస్కట్: ఒమన్ యొక్క సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలు మరియు ఆధునికతను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఒమన్ జ్యువెల్ ఆఫ్ అరేబియా ఎక్స్‌పెడిషన్ ప్రారంభోత్సవం నవంబర్ 25, 2024 సోమవారం రోజున లండన్‌లో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఒమన్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌ల మధ్య ఉన్న బలమైన చారిత్రక సంబంధాలను తెలియజేస్తుంది. ఈ కార్యక్రమానికి ఒమన్ సంస్కృతి, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి హెచ్‌హెచ్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైతం అల్ సైద్ మరియు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ విలియం ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.

ఈ యాత్ర జనవరి 6, 2025న రస్ అల్ హద్ వద్ద ప్రారంభమై తీరం వెంబడి సలాలా వరకు ప్రయాణిస్తుంది. 30 రోజుల కొనసాగే ఈ ప్రయాణంలో ఒమానీ యువత మరియు యునైటెడ్ కింగ్‌డమ్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఒమాన్ లో సాంస్కృతిక మార్పిడి మరియు పర్యావరణ అవగాహనపై దృష్టి సారిస్తారు. ఈ యాత్రను సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ (UKలోని ఒమన్ రాయబార కార్యాలయం ప్రాతినిధ్యం వహిస్తుంది) సహకారంతో వారసత్వం మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. 

ఈ ఎక్స్‌పెడిషన్ ద్వారా ఒమన్ యొక్క చారిత్రక ప్రాముఖ్యత, అందమైన పర్యాటక ప్రదేశాలు మరియు సాంస్కృతిక సంపదను ఈ కార్యక్రమం ద్వారా ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమంలో ఒమన్ యొక్క కళలు, సంగీతం, నృత్యం మరియు ఇతర సాంస్కృతిక అంశాలు ప్రదర్శించబడతాయి. ఇది ఒమన్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌ల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను మరింత బలపరచడానికి, రెండు దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక మార్పిడి కోసం ఒక మంచి వేదికగా నిలుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ఒమన్ యొక్క సాంస్కృతిక వైభవం మరియు చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com