'సంక్రాంతికి వస్తున్నాం' బ్యూటీఫుల్ సాంగ్ షూటింగ్
- November 24, 2024
మచ్ అవైటెడ్ క్రేజీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేసినట్లుగా జనవరి 14న సంక్రాంతికి విడుదల కానుంది. విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందుతోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే హ్యుజ్ బజ్‌ని సృష్టిస్తోంది.
సంక్రాంతికి వస్తున్నాం షూటింగ్ చివరి దశలో ఉంది, టీం ప్రస్తుతం వెంకటేష్, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పాత్ర పోషించిన మీనాక్షి చౌదరిపై ఒక బ్యూటీఫుల్ సాంగ్ నిచిత్రీకరిస్తోంది. డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌లోని అద్భుతమైన లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. భాను మాస్టర్ ఈ పాట కొరియోగ్రఫీని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్లో యూనిట్ ఈ పాటను మాత్రమే చిత్రీకరిస్తోంది.
ఐశ్వర్య రాజేష్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా కనిపించనుంది. త్వరలోనే మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
కో రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
యాక్షన్ డైరెక్టర్: వి వెంకట్
VFX: నరేంద్ర లోగిసా
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా
మార్కెటింగ్: నాని
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







