ప్రపంచంలోని రెండవ ఎత్తైన టవర్‌గా బుర్జ్ అజీజీ..డిజైన్, ప్రత్యేకతలు..!!

- November 25, 2024 , by Maagulf
ప్రపంచంలోని రెండవ ఎత్తైన టవర్‌గా బుర్జ్ అజీజీ..డిజైన్, ప్రత్యేకతలు..!!

దుబాయ్: బుర్జ్ ఖలీఫా తర్వాత టవర్ ప్రపంచంలోనే రెండవ ఎత్తైన నిర్మాణంగా షేక్ జాయెద్ రోడ్‌లో రాబోయే ‘బుర్జ్ అజీజీ దుబాయ్’ గుర్తింపు పొందింది. 132-అంతస్తుల ఎత్తున్న ఆకాశహర్మ్యం, 725 మీటర్ల పొడవు ఉండే దీని నిర్మాణం 2028 నాటికి పూర్తవుతుంది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే ఎత్తైన హోటల్ లాబీ, ఎత్తైన నైట్‌క్లబ్, ఎత్తైన అబ్జర్వేషన్ డెక్, ఎత్తైన రెస్టారెంట్, ఎత్తైన హోటల్ నిలయంగా గుర్తింపు పొందనుంది. 6 బిలియన్ దిర్హామ్‌లతో కూడిన బుర్జ్ అజీజీని డిజైన్.. ఎమిరేట్ నిరంతరం అభివృద్ధి చెందుతున్న స్కైలైన్‌కు, ప్రతిష్టను పెంచనుంది.  బుర్జ్ అజీజీలో వర్టికల్ షాపింగ్ మాల్ ప్రత్యేకంగా నిలువనుంది.  ఏడు సాంస్కృతిక ఇతివృత్తాల ద్వారా ప్రేరణ పొందిన ఏడు నక్షత్రాల ఆధారంగా  హోటల్; పెంట్‌హౌస్‌లు, అపార్ట్‌మెంట్‌లు , హాలిడే హోమ్‌లు, వెల్నెస్ సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్, ఆవిరి స్నానాలు, సినిమాస్, జిమ్‌లు, మినీ మార్కెట్‌లు, రెసిడెంట్ లాంజ్‌లు, పిల్లల ఆట స్థలం, సందర్శకులకు "మేఘాలలో" తేలిపోయే అనుభూతిని అందించేలా ఆడ్రినలిన్ జోన్ ను డిజైన్ చేసినట్టు మాథ్యూ ఫైనౌట్ డైరెక్టర్ ఆర్కిటెక్చరల్ డైరెక్టర్ ఎరిక్ హోకాన్సన్ తెలిపారు.  అజీజీ డెవలప్‌మెంట్స్ 2017లో కొనుగోలు చేసిన ప్లాట్‌పై బుర్జ్ అజీజీని నిర్మిస్తున్నట్లు హొకాన్సన్ చెప్పారు.  అజీజీ డెవలప్‌మెంట్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అయిన మీర్వైస్ అజీజీ అభిరుచులకు అనుగుణంగా టవర్ డిజైన్‌ చేసినట్టు పేర్కొన్నారు.  తాజా సాంకేతికత, వినూత్న నిర్మాణ రూపకల్పన పద్ధతులను ఉపయోగిస్తున్నామని, సూపర్-టాల్ నిర్మాణాలను పూర్తి చేసిన నిపుణులతో నిరంతరం సంప్రదిస్తూ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు బుర్జ్ అజీజీ తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com