మస్కట్లో నవంబర్ 29 నుండి Socca ప్రపంచ కప్ ఫుట్‌బాల్ 2024 టోర్నమెంట్
- November 25, 2024
మస్కట్: 2024 Socca ప్రపంచ కప్ - సిక్స్-ఎ-సైడ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు ఒమన్ లోనీ మస్కట్ లో జరుగుతుంది. మధ్యప్రాచ్యంలో మొదటిసారి నిర్వహించబడే ఈ టోర్నమెంట్ కు మొదటిసారి ఒమాన్ దేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఈ టోర్నమెంట్ లో ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి.
ఈ సందర్భంగా మిడిల్ ఈస్ట్ సోకా ఫెడరేషన్ ప్రెసిడెంట్ మరియు ఆర్గనైజింగ్ కమిటీ డైరెక్టర్ వలీద్ అల్ ఒబైదానీ మాట్లాడుతూ సోక్కా ప్రపంచ కప్‌ను నిర్వహించడం ప్రపంచ క్రీడారంగంలో ఒమన్‌కు ఒక ముఖ్యమైన మైలురాయి అని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన స్థానిక సోకా టోర్నీల ద్వారా ఒమానీ జట్టు ఎంపికైంది. తుది లైనప్ మరియు కోచింగ్ సిబ్బందిని త్వరలో ప్రకటిస్తారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనే టీమ్ లను ఎనిమిది గ్రూపులుగా విభజించామన్న ఆయన ఒక్కొక్క గ్రూపులో ఐదు టీంలు ఉంటాయనీ ఆయన తెలిపారు.
టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఒమన్ ఆటోమొబైల్ అసోసియేషన్‌లో అంతర్జాతీయ స్పెసిఫికేషన్‌లకు అనుగుణంగా ఆధునిక స్టేడియం నిర్మించబడింది. అత్యాధునికంగా సకల సదుపాయలతో నిర్మించిన ఈ స్టేడియం అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్‌లకు ఉపయోగపడుతుందని ఒబైదానీ చెప్పారు.అంతర్జాతీయ సోకా ఫెడరేషన్ ప్రతినిధి జూలియా పోటర్ మాట్లాడుతూ ఈ ఈవెంట్ ని నిర్వహించడం కోసం సుల్తానేట్ చేసిన ప్రయత్నాలను ప్రశంసిస్తూ, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన కొత్త స్టేడియం అభినందనీయం అని అన్నారు.
ఈ టోర్నమెంట్ లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన జట్లు వివరాలు ఇలా ఉన్నాయి. యుఎస్, ఇటలీ, కెనడా మరియు ఖతార్‌లతో పాటు ఒమన్ గ్రూప్ 1లో ఉంది. గ్రూప్ 2లో జర్మనీ, బల్గేరియా, జార్జియా, లిబియా, సెర్బియా ఉండగా, గ్రూప్ 3లో గ్రీస్, బెల్జియం, సైప్రస్, కువైట్, ఇరాక్ ఉన్నాయి. గ్రూప్ 4లో బ్రెజిల్, ఈజిప్ట్, ఐర్లాండ్, కొలంబియా మరియు ఇరాన్ ఉండగా, గ్రూప్ 5లో పోలాండ్, ఫ్రాన్స్, టర్కీ, పాకిస్థాన్, హైతీ ఉన్నాయి. గ్రూప్ 6లో మెక్సికో, లాట్వియా, అల్బేనియా, పెరూ మరియు ఆస్ట్రేలియా ఉండగా గ్రూప్ 7లో కజకిస్తాన్, ఇంగ్లాండ్, రొమేనియా, ఉరుగ్వే మరియు సూడాన్ ఉన్నాయి. గ్రూప్ 8లో క్రొయేషియా, హంగేరీ, అర్జెంటీనా, ట్యునీషియా, దక్షిణాఫ్రికా ఉన్నాయి.
ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నిర్వహించబడే ఈ టోర్నమెంట్ లో
కుటుంబ సభ్యులు మరియు సందర్శకుల కోసం వివిధ వినోద కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. ఈ టోర్నమెంట్ లో పాల్గొనే జట్లు తమ తమ దేశాలను ప్రతినిధ్యం వహిస్తూ పోటీపడతాయి. ఈ టోర్నమెంట్ నిర్వహణకు ఒమన్ ప్రభుత్వం మరియు స్థానిక భాగస్వాములు సహకారం అందిస్తున్నారు. ఈ టోర్నమెంట్ ఒమన్ క్రీడా రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని చెప్పవచ్చు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







